Andhra Pradesh: ఏపీలో పలు మున్సిపాలిటీల గ్రేడ్ల మార్పు

  • స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా తాడిపత్రి
  • గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా రాయచోటి 
  • పలు మున్సిపాలిటీల్లో పెరిగిన ఎన్నికయ్యే వార్డు సభ్యుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్ లో పలు మున్సిపాలిటీల గ్రేడ్ లను మార్చుతూ  ప్రభుత్వం ప్రకటన వెలువరించింది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా తాడిపత్రి అవతరించనుండగా, గ్రేడ్ వన్ మున్సిపాలిటీ హోదాను రాయచోటి అందుకోనుంది. బద్వేల్, ఆముదాలవలస, పుంగనూరు, నందికొట్కూరు మున్సిపాలిటీలను సెకండ్ గ్రేడ్ కు పెంచారు. కాగా పలు మున్సిపాలిటీల్లో ఎన్నికయ్యే వార్డు సభ్యుల సంఖ్యను కూడా పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పిడుగరాళ్ల మున్సిపాలిటీలో ఈ సంఖ్య 33కు, రాయచోటి లో 34కు, బద్వేల్ లో 35కు, పుంగనూరులో 31కు, ఆముదాల వలస లో 27కు, తాడిపత్రిలో 36కు, నందికొట్కూరు మున్సిపాలిటీలో 29కి పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

  • Loading...

More Telugu News