Cricket: బంగ్లా ప్రధానికి టీమిండియాను పరిచయం చేసిన కోహ్లీ.. గంట కొట్టి మ్యాచ్ ప్రారంభించిన హసీనా, మమతా బెనర్జీ వీడియో చూడండి!
- ముఖ్య అతిథిగా వచ్చిన షేక్ హసీనా
- స్వాగతం పలికిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ
- బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా
భారత్-బంగ్లాదేశ్ మధ్య డే/నైట్ టెస్టు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ చూసేందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ఆమె ఈ మ్యాచ్ ను ప్రారంభించారు. అంతకు ముందు ముఖ్య అతిథిగా వచ్చిన షేక్ హసీనాను బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఆహ్వానించారు. అనంతరం ఆమెకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత ఆటగాళ్లను స్వయంగా పరిచయం చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ టెస్టులో బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. షాద్మాన్ ఇస్లాం, ఇమ్రుల్ కేయీస్ ఓపెనర్లుగా బ్యాటింగ్ కు దిగారు. కాగా, హసీనా, మమతా బెనర్జీ గంటకొట్టి ఈ మ్యాచ్ ను ప్రారంభించారు. లార్డ్స్ మాదిరిగా ఈడెన్‌లోను గంట కొట్టి మ్యాచ్ ప్రారంభించే ఆనవాయితీని సౌరవ్ గంగూలీ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.