Maharashtra: ఫడ్నవీస్ బలనిరూపణకు వారం రోజుల గడువు!
- బలనిరూపణకు నవంబరు 30 వరకు గడువు
- మహారాష్ట్ర పరిణామాలతో కంగుతిన్న కాంగ్రెస్
- కాసేపట్లో కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. దేవేంద్ర ఫడ్నవిస్ కు బలనిరూపణకు వారం రోజుల గడువు ఇస్తున్నట్టు గవర్నర్ కోష్యారీ తెలిపారు. నవంబరు 30లోపు బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు.
మహారాష్ట్ర పరిణామాలతో కంగుతిన్న కాంగ్రెస్ ఈ రోజు కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ హాజరై మహారాష్ట్రలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చిస్తారు.