Shivsena: దేశ ఆర్థిక రాజధానిని దొడ్డిదారిలో ఆక్రమించుకోవాలనుకున్నారు: రవి శంకర్ ప్రసాద్
- శివసేన సిద్ధాంతాలను వదిలేసుకుంది
- ఎన్సీపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాయి
- వారి కుట్రలను బీజేపీ అడ్డుకుంది
మన దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు మహారాష్ట్రను బ్యాక్ డోర్ ద్వారా ఆక్రమించుకోవాలని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్ర చేశాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. వ్యక్తిగత లబ్ధి కోసం శివసేన తన సిద్ధాంతాలను వదిలేసుకుందని విమర్శించారు. తమను ప్రతిపక్షంలో కూర్చోమని ప్రజలు తీర్పిచ్చారని చెప్పిన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు... అధికార పీఠం కోసం మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాయని దుయ్యబట్టారు. అయితే వారి ప్రయత్నాలను బీజేపీ విజయవంతంగా అడ్డుకుందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఫడ్నవిసే సీఎం అభ్యర్థి అని ప్రచారం చేశామని చెప్పారు. బీజేపీకి ఉన్న బలంతో పాటు ఫడ్నవిస్ కు ఉన్న వ్యక్తిగత ఇమేజ్... శివసేన అభ్యర్థుల గెలుపులో కీలకపాత్ర పోషించిందని తెలిపారు.