Maharashtra: 50 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు శరద్ పవార్ తోనే ఉన్నారు.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: ఎన్సీపీ నేత ఛగల్ భుజబల్
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు
- అజిత్ పవార్ కి మాత్రం తిరిగి ఎన్సీపీలో చేరే అవకాశం లేదు
- కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం
తమ పార్టీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది ప్రస్తుతం తమ పార్టీ అధినేత శరద్ పవార్ తోనే ఉన్నారని ఎన్సీపీ సీనియర్ నేత ఛగల్ భుజబల్ తెలిపారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారని తెలిపారు. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఆధ్వర్యంలో తప్పకుండా ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. తమ పార్టీని మోసం చేసి బీజేపీతో చేతులకు కలిపిన అజిత్ పవార్ కి మాత్రం తిరిగి ఎన్సీపీలో చేరే అవకాశం లేదని అన్నారు.
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. కాసేపట్లో దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. ఈ రోజు బలపరీక్ష నిర్వహించాలని పిటిషన్ లో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కోరాయి.