Supreme Court: ఆదివారం వాదనలు వినకూడదన్న బీజేపీ తరఫు న్యాయవాది.. ఇది ప్రధాన న్యాయమూర్తి విచక్షణాధికారమన్న జస్టిస్ భూషణ్
- గవర్నర్ తరఫున ఎవరు వాదిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్న
- తమకు తెలియదన్న సొలిసిటర్ జనరల్
- ఈ పిటిషన్ ను అంగీకరించకూడదని విజ్ఞప్తి
మహారాష్ట్రలో బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే అవకాశం లేకుండా ఈ రోజే బలపరీక్షకు అవకాశం ఇవ్వాలని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు వాదనలు వింటోంది. ఆదివారం నాడు వాదనలు వినకూడదని బీజేపీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి అన్నారు.
దీంతో ఆదివారం విచారణ అనేది ప్రధాన న్యాయమూర్తి విచక్షణాధికారమని జస్టిస్ భూషణ్ తెలిపారు. గవర్నర్ తరఫున ఎవరు వాదిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా.. ఈ విషయం తెలియదని చెప్పారు. శివసేన కూటమికి ప్రభుత్వ ఏర్పాటు చేసే హక్కులేదని, ఈ పిటిషన్ ను అంగీకరించకూడదని ఆయన కోరారు.