Pawan Kalyan: కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం.. ఈ పుస్తకంలో 75వ పేజీలో శ్రీ జగన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఉంది: పవన్ కల్యాణ్
- 1996 లో పౌరహక్కుల వారు ఈ పుస్తకం ప్రచురించారు
- ఈ పుస్తకంలో అనేక చేదు నిజాలు బయటకి వచ్చాయి
- రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు
- మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది రాయల సీమలోనే
రాయలసీమలోని పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేస్తూ.. 1996లో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ప్రచురించిన పుస్తకాన్ని పోస్ట్ చేశారు. మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది రాయల సీమ లోనే అని పేర్కొన్నారు.
'1996 లో పౌరహక్కుల వారు ప్రచురించిన ఈ పుస్తకంలో అనేక చేదు నిజాలు బయటకి వచ్చాయి. రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ, దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి, వలసలు వెళ్లి పోతున్నారు, రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమవుతుంది' అని పవన్ ట్వీట్ చేశారు.
'అలాగే ఈ పుస్తకంలో 75వ పేజీలో శ్రీ జగన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఉంటుంది. మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది రాయల సీమ లోనే.. కర్నూలులోని ఒక రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని,14 ఏళ్ల ‘సుగాలి ప్రీతి ‘ ఉదంతమే దానికి ఉదాహరణ' అని పవన్ మరో ట్వీట్ లో చెప్పుకొచ్చారు.