Ram Nath Kovind: ఈ మహోన్నత ఘట్టంలో మనమంతా భాగస్వాములు కావడం మన అదృష్టం: రాష్ట్రపతి కోవింద్
- మన భారతీయ విలువలను నేడు ప్రపంచమంతా గౌరవిస్తోంది
- మన రాజ్యాంగంలో భారతీయుల హృదయ ధ్వని వినిపిస్తుంది
- రాజ్యాంగ నిర్మాతలను తలుచుకునేందుకు ఇదో చిరస్మరణీయమైన రోజు
- రాజ్యాంగమే మనందరికీ ఆదర్శం
మన రాజ్యాంగ నిర్మాతలను తలుచుకునేందుకు ఇదో చిరస్మరణీయమైన రోజని, ఈ మహోన్నత ఘట్టంలో మనమంతా భాగస్వాములు కావడం మన అదృష్టమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. భారత రాజ్యాంగ 70వ వార్షిక దినోత్సవం సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించారు.
మన భారతీయ విలువలను నేడు ప్రపంచమంతా గౌరవిస్తోందని, మన ఎన్నికల్లో పురుషులతో సమానంగా మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని కోవింద్ వ్యాఖ్యానించారు. మన రాజ్యాంగంలో భారతీయుల హృదయ ధ్వని వినిపిస్తుందని, మన ఆదర్శాలు, ఆకాంక్షలతో భారతీయుల భవిష్యత్ కూడా మన రాజ్యాంగంలో ముడిపడి ఉందని చెప్పారు. రాజ్యాంగమే మనందరికీ ఆదర్శమన్నారు. కాగా, రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా రాష్ట్రపతి కోవింద్ రూ.250 నాణేన్ని విడుదల చేశారు. దీని బరువు 40 గ్రాములు ఉంటుంది.