Sensex: రికార్డు స్థాయికి పెరిగి... చివరకు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 68 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 36 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 4 శాతానికి పైగా నష్టపోయిన ఎయిర్ టెల్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. ఈనాటి ట్రేడింగ్ ప్రారంభంలో రికార్డు స్థాయిని టచ్ చేసిన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల బాట పట్టాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 41,045 పాయింట్లకు ఎగబాకింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 68 పాయింట్లు నష్టపోయి 40,821కి పడిపోయింది. నిఫ్టీ 36 పాయింట్లు కోల్పోయి 12,037 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (3.09%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.46%), టాటా స్టీల్ (1.30%), యస్ బ్యాంక్ (1.02%), ఏసియన్ పెయింట్స్ (0.69%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-4.17%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.81%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.78%), టీసీఎస్ (-1.57%), మారుతి సుజుకి (-1.55%).