Telangana: ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్య కేసీఆరా? కొడుకు కేటీఆరా?: టీ-కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఫైర్
- కేసీఆర్ మొండివైఖరి వల్లే ఆర్టీసీ సమస్య జటిలం
- ఆర్టీసీకి రూ.300 కోట్లు ఇవ్వాలని చట్టం చేసింది కేసీఆరే
- ఏడాది తర్వాత ఆ చట్టాన్ని కేటీఆర్ రద్దు చేశారు!
సీఎం కేసీఆర్ మొండివైఖరి వల్లే ఆర్టీసీ సమస్య జటిలమైందని తెలంగాణ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. డీజిల్ ధర పెంపు, బస్ పాస్ రాయితీల ద్వారా ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి ఆర్థికంగా సపోర్ట్ చేసే నిమిత్తం జీహెచ్ఎంసీ నుంచి రూ.300 కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆరే చట్టం చేశారని, ఏడాది తర్వాత ఆ చట్టాన్ని కేటీఆర్ రద్దు చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్య కేసీఆరా? లేక ఆయన కొడుకు కేటీఆరా? అంటూ ధ్వజమెత్తారు. ప్రజాప్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్న కేసీఆర్, ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని మండిపడ్డారు.