Sharad Pawar: రాజకీయాలు, క్రికెట్ లో ఏమైనా జరగొచ్చన్న నితిన్ గడ్కరీకి కౌంటరిచ్చిన నవాబ్ మాలిక్
- గడ్కరీ పార్టీని శరద్ పవార్ క్లీన్ బౌల్డ్ చేశారు
- ఐసీసీ ఛైర్మన్ గా పవార్ పని చేసిన విషయాన్ని గడ్కరీ మర్చిపోయినట్టున్నారు
- ఇది క్లీన్ బౌల్డ్ కాదా?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఫడ్నవీస్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ... రాజకీయాలు, క్రికెట్ లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఎన్సీనీ నేత నవాబ్ మాలిక్ సెటైర్ వేశారు. గడ్కరీ పార్టీని శరద్ పవార్ క్లీన్ బౌల్డ్ చేశారని అన్నారు.
శరద్ పవార్ ఐసీసీ ఛైర్మన్ గా పనిచేశారన్న విషయాన్ని నితిన్ గడ్కరీ మరిచిపోయినట్టున్నారని నవాబ్ మాలిక్ అన్నారు. ఇది క్లీన్ బౌల్డ్ కాదా? అని ప్రశ్నించారు. 2010 నుంచి 2012 వరకు ఐసీసీ ఛైర్మన్ గా శరద్ పవార్ వ్యవహరించారు.