KTR meet with vice pricedent Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసిన మంత్రి కేటీఆర్
- ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్
- మర్యాద పూర్వకంగా వెంకయ్యను కలిశానన్న మంత్రి
- రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై వివరణ
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. మర్యాదపూర్వకంగా వెంకయ్యనాయుడిని కలిశానని కేటీఆర్ వెల్లడించారు. ఉపరాష్ట్రపతి అధికారిక నివాసంలో ఆయనను కలిశానన్న మంత్రి రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించినట్లు తెలిపారు.