BJP: జార్ఖండ్ ఎన్నికల్లోనూ మహారాష్ట్ర సీనే.. అంచనా వేసిన సి-ఓటర్ సర్వే
- ఈ నెల 30న తొలి విడత ఎన్నికలు
- మ్యాజిక్ ఫిగర్ 41
- 33-38 స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ
జార్ఖండ్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని సి-ఓటర్ ఐఏఎన్ఎస్ ప్రీపోల్ సర్వే అంచనా వేసింది. జార్ఖండ్‌లోని మొత్తం 81 స్థానాలకు ఐదు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఈ నెల 30న ప్రారంభం కానుండగా, చివరి విడత ఎన్నికలు డిసెంబరు 20న జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందన్న సర్వే.. బీజేపీ 33-38 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని సర్వే సంస్థ తెలిపింది. ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్లు అవసరం కాగా, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. జేఎంఎంకు 18-28 సీట్లు, జేవీఎం 9, ఏజేఎస్యూకు 6, కాంగ్రెస్‌కు 6-9 సీట్లు లభించవచ్చని సర్వే అంచనా వేసింది.