Greece: టీవీ రిపోర్టర్ ను లైవ్ లో ముప్పుతిప్పలు పెట్టిన వరాహం!

  • గ్రీస్ లో భారీ తుపాను
  • వరదలో అతలాకుతలమైన ఏథెన్స్
  • రిపోర్టింగ్ కు వెళ్లిన పాత్రికేయుకుడికి చుక్కలు చూపించిన పంది
ఎలక్ట్రానిక్ మీడియాలో ఆన్ సీన్ లైవ్ ఇవ్వడం ఎప్పట్నించో ఉంది. సంఘటన స్థలం నుంచి వార్తకు సంబంధించిన వివరాలను అందించేందుకు రిపోర్టర్లు ఎంతో ఉత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఇటీవల  గ్రీస్ రాజధాని ఏథెన్స్ లో భారీ తుపాను సంభవించడంతో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. ఈ విషయాన్ని రిపోర్టింగ్ చేయాడానికి ఓ న్యూస్ చానల్ రిపోర్టర్ లాజోస్ మాంటికో వరదలు సంభవించిన ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి నుంచి స్టూడియోకు లైవ్ ఇచ్చేందుకు సిద్ధపడుతుండగా ఓ పంది అతడి వెంటపడింది.

మాంటికో ఎటు వెళితే అది కూడా అటే వెళుతూ అతడ్ని నానా తిప్పలు పెట్టింది. బాగా బలిసిన ఆ వరాహం ముట్టెతో నెడుతుండడంతో రిపోర్టర్ బాధ చెప్పనలవి కాలేదు. ఓవైపు లైవ్ లో యాంకర్, ఇతర ప్రెజెంటర్లు సిద్ధంగా ఉన్నా ఆ పంది నుంచి తప్పించుకోలేక సతమతమయ్యాడు. ఇది చూసి స్టూడియోలో ఉన్నవాళ్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Greece
Athens
Reporter
Ant1
Pig

More Telugu News