Hyderabad: ప్రియాంకారెడ్డి హత్య కేసు: హైదరాబాద్ కు జాతీయ మహిళా కమిషన్
- సుమోటాగా కేసు స్వీకరణ
- సాయంత్రంలోగా చేరుకోనున్న బృందం
- పూర్తిస్థాయిలో దర్యాప్తు
పశు వైద్యాధికారిణి ప్రియాంకారెడ్డి హత్యాచారం కేసు విషయంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. హత్య కేసును సుమోటాగా స్వీకరించింది. ఈ కేసులో విచారణ నిమిత్తం హైదరాబాద్ కు ఓ బృందాన్ని పంపుతోంది. సాయంత్రంలోగా జాతీయ మహిళా కమిషన్ సభ్యులు హైదరాబాద్ చేరుకోనున్నారు. ప్రియాంకారెడ్డి హత్యాచారం కేసులో జాతీయ మహిళా కమిషన్ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనుంది.
కాగా, ప్రియాంకారెడ్డి తల్లిదండ్రులను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. కాగా, ప్రియాంకారెడ్డిపై నలుగురు వ్యక్తులు కలిసి అత్యాచారం చేసి, హత్య చేశారని పోలీసులు గుర్తించారు. టోల్ ప్లాజా వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో ఈ ఘటనకు పాల్పడినట్లు తేల్చారు.