Gold: బంగారం ఆభరణాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. హాల్ మార్క్ తప్పనిసరి

  • నాణ్యమైన బంగారం అందించే దిశగా చర్యలు
  • వచ్చే ఏడాది జనవరి 15 నుంచి బంగారు ఆభరణాలపై హాల్ మార్క్  
  • నిల్వలు అమ్ముకునేందుకు వ్యాపారులకు ఏడాది సమయం

బంగారు ఆభరణాలు, బంగారంతో తయారయ్యే కళాఖండాలకు ఇకపై తప్పనిసరిగా హాల్ మార్క్ ఉండాలని కేంద్రం నిర్ణయించింది. వినియోగదారులకు నాణ్యమైన బంగారాన్ని అందించేందుకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంటోంది. హాల్ మార్క్ నిబంధన తప్పనిసరి చేస్తూ వచ్చే ఏడాది జనవరి 15న ప్రకటన విడుదల అవుతుందని కేంద్రం పేర్కొంది. ఈ నిబంధన అమలు కోసం బంగారం వ్యాపారులకు సంవత్సరం గడువు విధిస్తామని, అప్పటిలోగా తమ వద్ద ఉన్న నిల్వల విక్రయాలను పూర్తిచేసుకోవాలని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News