Amaravathi: చంద్రబాబు పర్యటనలో అనుమతి లేకుండా టీడీపీ డ్రోన్ వాడింది.. కేసు నమోదు చేస్తాం: తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి

  • హై సెక్యూరిటీ జోన్ ప్రాంతం ఇది
  • 30 పోలీస్ యాక్టు అమలులో వుంది
  • అనుమతి లేకుండా డ్రోన్ వినియోగించినట్టు విచారణలో తేలింది

అమరావతి పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ నేతలు మండిపడటమే కాకుండా, డీజీపీ వ్యవహరించిన తీరుపైనా విమర్శలు చేశారు. రేపు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో అమరావతి పర్యటనలో టీడీపీ డ్రోన్లను వినియోగించడాన్ని నిరసిస్తూ వైసీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. లేళ్ల అప్పిరెడ్డి చేసిన ఫిర్యాదులో వాస్తవం వుందని అన్నారు. హై సెక్యూరిటీ జోన్ లో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా టీడీపీ డ్రోన్ వాడిందని, తమ విచారణలో ఈ విషయం తేలిందని అన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. 30 పోలీస్ యాక్టు అమలులో వున్న ప్రాంతంలో డ్రోన్ వినియోగించాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News