Bank holidays: మీకు బ్యాంకులో ఖాతా ఉందా...అయితే ఈ నెలలో సెలవులు ఎన్నో తెలుసా!
- డిసెంబరులో 8 రోజులు బ్యాంకుల మూత
- ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు
- 25న క్రిస్మస్ హాలిడే
డిసెంబరు నెల అనగానే పండగ రోజులు వచ్చేసినట్టే జనం భావిస్తారు. క్రిస్మస్ తో వేడుకలు ప్రారంభమై కొత్త సంవత్సరం, ఆ తర్వాత వచ్చే నెలలో సంక్రాంతికి అవసరమైన ఏర్పాట్లు కూడా ఈ నెలలోనే జరుగుతుంటాయి. అందువల్ల సాధారణంగా డిసెంబరు నెలలో బ్యాంకు లావాదేవీలు అధికంగా ఉంటాయి. కానీ ఈనెలలో అన్ని జాతీయ బ్యాంకులు ఎనిమిది రోజులపాటు పనిచేయవు. అందువల్ల నగదు వ్యవహారాల్లో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం తప్పనిసరి. ముఖ్యంగా భారీ మొత్తం అవసరం ఉన్నవారు అవసరమైన మొత్తాన్ని ముందుగానే తెచ్చి పెట్టుకోవడం మంచిది.
ఈ నెలలో మొత్తం ఐదు ఆదివారాలు వచ్చాయి. అలాగే, రెండు, నాలుగో శనివారం సెలవు రోజులు. వీటికి అదనంగా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. అంటే మొత్తంగా ఈ నెలలో 8 సెలవు దినాలు రాగా, బ్యాంకులు పనిచేసేది 23 రోజులు మాత్రమే. అయితే నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉన్న వారికి కొంత వెసులు బాటు ఉంటుంది.