Rape case: అక్కడ అత్యాచారం చేస్తే...వారంలోపే శిక్ష అమలు!

  • ఉరి నుంచి మర్మాంగాల తొలగింపు వరకు
  • అరబ్ దేశాల్లో దారుణ శిక్షలు
  • బహిరంగంగానే మరణ శిక్ష

శిక్షలు బట్టే నిందితుల్లో భయం ఉంటుంది. చట్టాలు ఎన్ని ఉన్నా వాటి అమలుతోనే ప్రయోజనం. మన దేశంలో నిర్భయ వంటి చట్టం అమల్లో ఉన్నా మానవ మృగాల్లో భయం లేకపోవడానికి కారణం అమల్లోని లోపాలే కారణం. హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన పెల్లుబికుతోంది. ఆ మానవమృగాలను బహిరంగంగా ఉరి తీయాలని జనం రోడ్లపైకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌పై దాడికి కూడా ప్రయత్నించారు. 

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చట్టాల్లో మార్పులు తీసుకురావాలని, బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాలను సమూలంగా మార్చాలనే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో రేప్ కి ఉన్న శిక్షలు తెలుసుకుందాం.

సౌదీ అరేబియాలో రేపిస్ట్‌లకు మత్తు ఇచ్చి బహిరంగంగా ఉరి, శిరచ్ఛేదం, రాళ్లతోనూ కొట్టి చంపుతారు. ఇరాన్‌లో బహిరంగ ఉరి లేదా తుపాకీతో కాల్చి చంపడం చేస్తారు. అఫ్గానిస్థాన్‌‌లో అత్యాచారం జరిగిన నాలుగు రోజుల్లోనే శిక్ష విధిస్తారు. అదికూడా బాధితులతో నిందితుల తలపై కాల్చి చంపడం లేదా ఉరి తీయడం చేస్తారు.

ఉత్తర కొరియాలో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి తలపై లేదా సున్నిత అవయవాలపై ఓ ప్రత్యేక బృందం తుపాకీతో కాల్చి చంపుతుంది. చైనాలో రేప్‌ను ఘోరమైన నేరంగా పరిగణిస్తారు. విచారణ ప్రక్రియ చాలా వేగంగా పూర్తిచేసి, నేరస్థులను వెనుక నుంచి తుపాకీతో కాల్చి చంపుతారు. ఒక్కోసారి వారి మర్మాంగాన్ని తొలగిస్తారు.

 నెదర్లాండ్స్‌‌లో ఫ్రెంచి కిస్‌, లైంగిక వేధింపులను కూడా అత్యాచారం కింద పరిగణిస్తారు.  జపాన్‌‌లో 20 ఏళ్ల జైలుశిక్ష, అమెరికాలో 30 ఏళ్ల జైలు (లూసియానా, ఫ్లోరిడా లాంటి రాష్ట్రాల్లో చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధిస్తారు), ఫ్రాన్స్‌లో 15 ఏళ్ల నుంచి 30 ఏళ్లు,  నార్వేలో 4 నుంచి 15 ఏళ్ల జైలు, రష్యాలో 4 నుంచి 20 ఏళ్లు,  ఇజ్రాయెల్‌‌లో 16 ఏళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు.

యూఏఈలో నేరస్థుడికి వారం రోజుల్లోనే ఉరి శిక్ష పడుతుంది. పొరుగున ఉన్న పాకిస్థాన్ లో గ్యాంగ్ రేప్, మైనర్లపై లైంగిక దాడులు, అత్యాచారం ఈ మూడింటికీ మరణ శిక్ష విధిస్తారు. క్యూబాలో అత్యాచారానికి ఒడిగడితే మరణదండన తప్పదు. బంగ్లాదేశ్‌లో యావజ్జీవిత కారాగారం, కేసు తీవ్రతను బట్టి మరణ శిక్ష ఉంటుంది.

  • Loading...

More Telugu News