rtc: 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో నేరుగా చర్చిస్తోన్న కేసీఆర్.. కార్మికులతో కలిసి కాసేపట్లో భోజనం చేయనున్న సీఎం
- ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులకు ఆహ్వానం
- ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలపై కూలంకశంగా చర్చ
- ఆర్టీసీ కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించనున్న సీఎం
రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో ఈ రోజు ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. కార్మికులతో కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం కూడా కార్మికులతో నేరుగా మాట్లాడుతారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలను కూలంకశంగా చర్చిస్తారు.
ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ, ఈడీలు, ఆర్ఎంలు, డీవీఎంలను కూడా ఆహ్వానించారు. కార్మికుల సమస్యలను వారినే అడిగి తెలుసుకోనున్నారు. ఆయన సానుకూలంగా స్పందించి తమను ఆదుకుంటారని ఆశిస్తున్నట్లు కార్మికులు తెలిపారు. ఆర్టీసీ స్థితిగతులను సీఎం నేరుగా కార్మికులకే వివరిస్తున్నారు. ఆర్టీసీ కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించనున్నారు.