Tiger: ఆడ తోడు కోసం ఆరు జిల్లాలు తిరిగిన పెద్దపులి!

  • 2016లో జన్మించిన పులి
  • 150 రోజుల్లో 1,300 కిలోమీటర్ల పయనం
  • చివరకు ధ్యానగంగ అడవుల్లో నివాసం

వయసుకు వచ్చిన ఓ మగ పులి, ఆడతోడు కోసం ఏకంగా 150 రోజుల పాటు 1,300 కిలోమీటర్ల దూరం తిరిగింది. ఇందులో భాగంగా మహారాష్ట్రతో పాటు తెలంగాణలోని ఆరు జిల్లాల్లో ఈ పులి ప్రయాణించింది. చివరకు బుల్డానా జిల్లాలోని ధ్యానగంగ అభయారణ్యానికి చేరి, అక్కడ తన ప్రయాణాన్ని ఆపింది. ఈ ఆసక్తికర విషయాన్ని అటవీ శాఖాధికారులు వెల్లడించారు.

2016లో తిపేశ్వర్ పులుల అభయారణ్యంలో మూడు పులులు జన్మించాయి. వీటికి అధికారులు సీ-1, సీ-2, సీ-3 అని పేర్లు పెట్టారు. వీటికి ఇప్పుడు మూడేళ్లు. ఆడ తోడును, తనకంటూ ఓ ప్రత్యేక ప్రదేశాన్ని వెతుక్కుంటూ మగ పులులైన సీ-1, సీ-3 బయలుదేరాయి. వీటి కదలికలను పరిశీలించేందుకు అధికారులు రేడియో కాలర్లు అమర్చారు. గత జూన్ లో తిపేశ్వర్ ను దాటిన ఇవి, పంధార్ కవాడా డివిజన్ మీదుగా తెలంగాణకు చేరాయి. సీ-3 అనే పెద్దపులి, ఆదిలాబాద్ పట్టణం శివార్ల వరకూ వచ్చింది. సీ-1 అనే పులి అంబాడీ ఘాట్, కిన్వాత్ అడవుల ద్వారా ఆదిలాబాద్ డివిజన్ కు వచ్చింది.

ఈ సంవత్సరం ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్య అంతర్రాష్ట్ర అడవుల్లో ఎన్నో రోజులు ఉన్న ఇవి, ఇప్పుడు ధ్యానగంగ అభయారణ్యానికి చేరుకున్నాయి. వందలాది గ్రామాలను దాటిన ఇవి, మానవులపై దాడికి దిగలేదని, ఆకలి వేసినప్పుడు పశువులపై దాడులు చేశాయని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News