Hyderabad: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ఆటోడ్రైవర్.. పరీక్ష చేసి, విస్తుపోయిన పోలీసులు
- గత నెల 16న కాప్రా పరిధిలో పోలీసుల డ్రంకెన్ డ్రైవ్
- రక్తంలోని ఆల్కహాల్ శాతం చూసి షాక్
- ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు
హైదరాబాద్లోని కాప్రా పరిధిలో గత నెల 16న పోలీసులు చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్లో మల్కాజిగిరికి చెందిన వి.రాజు అనే ఆటో డ్రైవర్ పట్టుబడ్డాడు. అతడికి శ్వాస పరీక్ష నిర్వహించిన పోలీసులకు మూర్ఛ వచ్చినంత పనైంది. అతని రక్తంలో ఆల్కహాల్ శాతం ఏకంగా 490 పాయింట్లు దాటడంతో పోలీసులు షాకయ్యారు.
నిజానికి రక్తంలో ఆల్కహాల్ శాతం 40 పాయింట్లు మించితే కేసు నమోదు చేస్తారు. 100 పాయింట్లు దాటితే తీవ్రంగా పరిగణిస్తారు. అలాంటిది ఏకంగా 490 పాయింట్లు దాటడంతో అతడిని ఏమనాలో కూడా పోలీసులకు పాలుపోలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజును మల్కాజిగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. నిన్న కేసును విచారించిన కోర్టు అతనికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.