Pawan Kalyan: రైతు బజార్ కు వెళ్లిన పవన్ కల్యాణ్.. ఇసుక మాదిరే ఉల్లి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం!
- గత ప్రభుత్వాలదే తప్పు అంటూ తప్పించుకోవద్దు
- ఇది సమస్యకు పరిష్కారం కాదు
- ప్రణాళికలు రచించడంలో విఫలమయ్యారు
- సమర్థత లేకపోతే తప్పుకొని మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత పనవ్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన తిరుపతిలోని ఆర్సీ రోడ్డు వద్ద ఉన్న రైతు బజార్ కు వెళ్లారు. అక్కడ ఉల్లిపాయల కోసం ప్రజలు బారులు తీరి నిలబడి ఉండడాన్ని చూసి, వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఉల్లికోసం ప్రజలు పడుతున్న కష్టాలు ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన విమర్శించారు.
గత ప్రభుత్వాలదే తప్పు అంటూ తప్పించుకోవడం సమస్యకు పరిష్కారం కాదని పవన్ విమర్శించారు. ప్రణాళికలు రచించడంలో ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత మాదిరిగానే ఉల్లి కోసం కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమర్థత లేకపోతే తప్పుకొని మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.