Ramajogayya sastri: ఆడియో ఫంక్షన్లలో పాటల రచయితకి ప్రాధాన్యత ఉండటం లేదు: రామజోగయ్య శాస్త్రి
- లిరిక్ రైటర్స్ కి ప్రాధాన్యత ఉండటం లేదు
- శ్రమకి తగిన గుర్తింపు రావడంలేదు
- అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటానన్న శాస్త్రి
రామజోగయ్య శాస్త్రి ఎన్నో ఉత్సాహభరితమైన పాటలు .. ఉల్లాసభరితమైన పాటలతోపాటు, ఆలోచింపజేసే సందేశాత్మక గీతాలను కూడా రాశారు. అలాంటి ఆయన తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. "చిత్రపరిశ్రమలో లిరిక్ రైటర్స్ కి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ, రావలసినంత గుర్తింపు రావడం లేదని నాకు అనిపించింది.
ఇటు ఇండస్ట్రీ నుంచి .. అటు పబ్లిక్ నుంచి మా శ్రమకి తగిన గుర్తింపు రావడం లేదని గ్రహించాను. ఆడియో ఫంక్షన్ లిరిక్ రైటర్స్ కి సంబంధించినదే అయినప్పటికీ, అక్కడ మా పాత్ర అంతగా వుండటం లేదనేది అర్థమైంది. నన్ను గౌరవించడండి అని అడగడంకన్నా .. మన పనిని జనంలోకి తీసుకెళితే ఆ పనే కావాల్సినంత గౌరవాన్ని తీసుకొస్తుంది. అందువల్లనే నేను రాసిన పాటలను సోషల్ మీడియాలో పెడుతుంటాను. అందులోని సాహిత్యాన్ని గురించిన విషయాలను పంచుకుంటాను" అని చెప్పుకొచ్చారు.