Ramajogayya Sastri: పాట రాయడాన్ని సిరివెన్నెల ఒక తపస్సులా భావిస్తారు: రామజోగయ్య శాస్త్రి
- పాట బాగా రావడానికి కసరత్తు చేస్తాను
- ఎవరినీ విసుక్కునే అలవాటు లేదు
- సీతారామశాస్త్రి ఒక తాపసి అని చెప్పిన శాస్త్రి
తెలుగు పాటల రచయితలలో రామజోగయ్య శాస్త్రి స్థానం ప్రత్యేకం. ఆ విషయాన్ని ఆయన రాసిన పాటలే స్పష్టం చేస్తుంటాయి. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన తన మనోభావాలను పంచుకున్నారు.
పాటలు రాసే విషయంలో నేను నా వంతు కృషి చేస్తుంటాను. ఒకటికి నాలుగు రాసి తీసుకెళుతుంటాను. అవి సంగీత దర్శకుడికి నచ్చకపోతే మళ్లీ ప్రయత్నం చేస్తూ వుంటాను. ఈ విషయంలో నేను కసరత్తు చేస్తానేగానీ కసురుకోను. ఇక పాట రాయడాన్ని మా గురువుగారు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఒక తపస్సులా భావిస్తారు. పాట రాసే విషయంలో ఆయన నిత్య విద్యార్ధిలా కనిపిస్తారు. చిన్న సినిమా కోసమే అయినా .. పెద్ద సినిమా కోసమే అయినా ఆయన ఏకాగ్రత ఒక మాదిరిగానే ఉంటుంది. ఆయన గురించిన పుస్తకం రాస్తే దానికి 'తాపసి' అనే పేరు పెడతాను" అని చెప్పుకొచ్చారు.