Sensex: ట్రంప్ ఎఫెక్ట్... నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 104 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 50 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- ఏడున్నర శాతం పతనమైన యస్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. బ్రెజిల్, అర్జెంటీనాల నుంచి దిగుమతి అవుతున్న స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ఇప్పటి వరకు ఉన్న సుంకాలను సమీక్షిస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం అంతర్జాతీయ మార్కెట్లపై పెను ప్రభావాన్ని చూపింది. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారి తీస్తాయనే భయాందోళనలకు ఇన్వెస్టర్లు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 104 పాయింట్లు కోల్పోయి 40,697కి పడిపోయింది. నిఫ్టీ 50 పాయింట్లు పతనమై 11,998 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఆటో (3.16%), టీసీఎస్ (1.57%), ఇన్ఫోసిస్ (0.87%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (0.80%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.73%).
టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-7.49%), టాటా స్టీల్ (-5.10%), వేదాంత లిమిటెడ్ (-3.18%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.95%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.95%).