YCP MLA Sridevi criticism against Chandra babu naidu: రైతులు ఉచితంగా భూములు ఇవ్వలేదు: వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
- కౌలు ఇస్తానని చెప్పి రైతులను దగా చేశారు
- ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు
- 13 దేశాలు పర్యటించి.. ఖజానాను దుర్వినియోగం చేశారు
ఏపీ రాజధానిని కట్టేందుకు గ్రాఫిక్స్ పేర వృథాగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ధ్వజమెత్తారు. ఈ నెపంతో13 దేశాలు పర్యటించారన్నారు. 28 సార్లు టూర్లు చేసి ఖజానాను దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. రైతులను మభ్యపెట్టి అసెన్డ్ భూములను లాక్కున్నారని విమర్శించారు. ఆమె ఈ రోజు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
‘మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు. రైతులు ఉచితంగా భూమిలిచ్చారని చెబుతున్నారు. అది అబద్ధం. కౌలు ఇస్తానని చెప్పి భూములు తీసుకుని రైతులను మీరు మోసం చేశారు. మీ అనుంగులు ఆ భూములను కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. మీకు ఇష్టమైన కంపెనీలకు ఆ భూములను ఇచ్చారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి అమరావతికి పారిపోయి వచ్చారు. నాణ్యతలేకుండా అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ కట్టించారు. అసెంబ్లీ నిర్మాణంలో కోట్ల రూపాయలు దోచుకున్నారు’ అని అమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.