Ravi Kishan: భారత్ ముమ్మాటికీ హిందూ దేశమే: రవి కిషన్
- దేశంలో హిందువుల జనాభా 100 కోట్లు ఉంది
- ప్రపంచంలో ఎన్నో క్రిస్టియన్, ముస్లిం దేశాలు ఉన్నాయి
- మనకు భారత్ ఉండటం అద్భుతం
ప్రముఖ సినీ నటుడు, గోరఖ్ పూర్ బీజేపీ ఎంపీ రవి కిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ, మన దేశంలో హిందువుల జనాభా 100 కోట్లని... అందువల్ల ఈ దేశం ముమ్మాటికీ హిందూ దేశమేనని అన్నారు. ప్రపంచంలో ఎన్నో క్రిస్టియన్, ముస్లిం దేశాలు ఉన్నాయని... మన హిందూ సంస్కృతి, సంప్రదాయాలను సజీవంగా ఉంచుకునేందుకు మనకు 'భారత్' ఉండటం అద్భుతమని అన్నారు. రవికిషన్ వ్యాఖ్యలపై కొందరు విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.