Sensex: రెపో రేటును మార్చని ఆర్బీఐ.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- రెపోరేటును 5.15 శాతం వద్దే స్థిరంగా ఉంచిన ఆర్బీఐ
- నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు
- 70 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
తాజా ద్రవ్య పరపతి సమీక్షలో రెపో రేటును మార్చడం లేదని ఆర్బీఐ ప్రకటించింది. 5.15 శాతం వద్దే రెపోరేటును స్థిరంగా ఉంచుతున్నట్టు తెలిపింది. దీంతో, మార్కెట్లు నెమ్మదిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 70 పాయింట్లు నష్టపోయి 40,779కి పడిపోయింది. నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 12,018 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (1.97%), ఐటీసీ (1.65%), ఎల్ అండ్ టీ (1.27%), ఇన్ఫోసిస్ (0.83%), టెక్ మహీంద్రా (0.69%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-2.84%), టాటా స్టీల్ (-2.47%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.36%), హీరో మోటో కార్ప్ (-1.79%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.74%).