Supreme Court: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై అదే తుది తీర్పు కాదు: సుప్రీం కీలక వ్యాఖ్యలు

  • మహిళలందరూ ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ గతేడాది తీర్పు
  • తీర్పును గుర్తు చేసిన ఇందిరా జైసింగ్ 
  • కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశామన్న సుప్రీంకోర్టు

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గతేడాది ఇచ్చినదే తుది తీర్పు కాదంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శబరిమల బయలుదేరిన బిందు అమ్మిని అనే మహిళను అడ్డుకోవడంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గతేడాది ఇచ్చిన తీర్పును కాలరాస్తూ ఆమెపై దాడికి పాల్పడ్డారంటూ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. స్పందించిన ధర్మాసనం 2018లో ఇచ్చినదే తుది తీర్పు కాదని, ఈ అంశాన్ని ఏడుగురు సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశామని పేర్కొంది. ఆ బెంచే తుది తీర్పు వెలువరిస్తుందని పేర్కొంది.

శబరిమలతోపాటు ముస్లిం, పార్శీ మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై ఈ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గతేడాది తీర్పుపై ఎటువంటి స్టే ఇవ్వలేదన్న ఇందిరా జైసింగ్ వాదనలను అంగీకరించిన జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. గతంలో దాఖలైన మరో పిటిషన్‌తో కలిపి వచ్చేవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News