Disha: పోలీసుల నుంచి ఆరిఫ్, చెన్నకేశవులు వెపన్స్ లాక్కున్నారు: ప్రెస్ మీట్ లో సజ్జనార్
- మిగిలిన నిందితులు రాళ్లు రువ్వారు
- 15 మంది పోలీసులు వున్నారు
- ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు
దిశ హత్య కేసు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. దిశను హతమార్చిన చోటే ఈ దుర్మార్గులను అంతమొందించారు. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ ఎన్ కౌంటర్ లో 15 మంది పోలీసులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. పోలీసుల నుంచి ఆరిఫ్, చెన్నకేశవులు వెపన్స్ లాక్కున్నారని... మిగిలిన ముగ్గురు నిందితులు పోలీసులపై రాళ్లు రువ్వారని చెప్పారు. పోలీసులు హెచ్చరించినా వారు వినలేదని అన్నారు. ఆ తర్వాత పోలీసులు కాల్పులు జరిపారని... ఆ తర్వాత కాల్పులు ఆగిపోయాయని... అనంతరం చూస్తే నలుగురూ చనిపోయి కనిపించారని చెప్పారు.
ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయని సజ్జనార్ తెలిపారు. ఉదయం 5.30 గంటల నుంచి 6.15 వరకు ఈ ఎన్ కౌంటర్ జరిగిందని చెప్పారు. ఈ నలుగురూ కరుడుగట్టిన నేరస్తులని తెలిపారు. వీరి నేర చరిత్రపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.