Sensex: లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 334 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 104 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 10 శాతానికి పైగా నష్టపోయిన యస్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజ భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు నష్టాల బాటలోనే నడిచాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. టెలికాం సూచీ మినహా అన్ని సూచీలు నష్టాలనే నమోదుచేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 334 పాయింట్లు నష్టపోయి 40,445కి పడిపోయింది. నిఫ్టీ 104 పాయింట్లు పతనమై 11,914కి జారిపోయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.61%), టాటా స్టీల్ (0.53%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.25%), ఏసియన్ పెయింట్స్ (0.17%), టీసీఎస్ (0.05%).
టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-10.63%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-5.40%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.50%), టాటా మోటార్స్ (-3.07%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.81%).