Uttar Pradesh: ఉన్నావో ఘటనపై యూపీ అసెంబ్లీ ఎదుట ధర్నాకు దిగిన అఖిలేశ్ యాదవ్
- ఉన్నావో అత్యాచార బాధితురాలి హత్య పట్ల నిరసన
- రేపు యూపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 'శోక సభలు'
- చరిత్రలో ఇది ఒక చీకటి రోజన్న అఖిలేశ్
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో అత్యాచార బాధితురాలి హత్య పట్ల సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ రాష్ట్ర అసెంబ్లీ ఎదుట ధర్నాకు దిగారు. ఆయనతో పాటు పలువురు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, చరిత్రలో ఇది ఒక చీకటి రోజని అఖిలేశ్ విమర్శించారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి ఘటనలు అధికమైపోయాయని అఖిలేశ్ ఆరోపించారు. అమ్మాయిల జీవితాలను వారు కాపాడలేకపోతున్నారని, ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన అన్నారు. రేపు యూపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 'శోక సభలు' నిర్వహిస్తామని ప్రకటించారు.