onion: వివాహ శుభకార్యంలో బహుమతిగా ఉల్లిపాయలు
- కర్ణాటకలోని బాగల్కోటెలో ఘటన
- పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.200
- నిర్మలా సీతారామన్‌కు పెరంబలూర్ కాంగ్రెస్ నేతలు ఉల్లిగడ్డల పార్సిల్
వివాహ శుభకార్యంలో ఉల్లిపాయలు బహుమతిగా మారాయి. కర్ణాటకలోని బాగల్కోటెలో జరిగిన ఓ పెళ్లిలో వరుడి స్నేహితులు ఉల్లిగడ్డలను ఓ గంపలో వేసి పెళ్లి గిఫ్ట్ గా అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.200కు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ధరలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
మరోవైపు, తాము ఉల్లిగడ్డలను అంతగా తినబోమని ఇటీవల చెప్పిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు పెరంబలూర్ కాంగ్రెస్ నేతలు ఉల్లిగడ్డలను పార్సిల్ చేశారు. ఉల్లిగడ్డలు తినని వారు మొదట వాటిని తినాలని, ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పలు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల పంటలకు తీవ్ర నష్టం రావడంతో ఉల్లి దిగుబడి తగ్గిపోయింది. దీంతో ఉల్లి కొరత పెరిగి ధరలు పెరిగిపోయాయి.