Telugudesam: కిలో ఉల్లిపాయల్లో నలభై శాతం కుళ్లిపోయినట్టున్నాయి: చంద్రబాబునాయుడు
- క్యూలో ఐదారు గంటలు నిలబడి ఉల్లి కొనుక్కొనే పరిస్థితి
- ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ లేదు
- ఇది దున్నపోతు-ప్రభుత్వం
ప్రజలకు విక్రయించే కిలో ఉల్లిపాయల్లో నలభై శాతం కుళ్లిపోయినట్టున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎత్తుకుని, క్యూలో ఐదారు గంటలు నిలబడి ఉల్లిపాయలు కొనుక్కుంటున్నారని, ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ లేదంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
గుడివాడలో సాంబయ్య అనే వ్యక్తి క్యూలో కుప్పకూలిపోయాడని, ఈ విషయం ఎంత సిగ్గుచేటో ప్రభుత్వం ఆలోచించుకోవాలని అన్నారు. ఉల్లిపాయలే వాడాలా? క్యాబేజ్ వాడుకోవచ్చుగా? అంటూ ఓ మంత్రి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గంటల తరబడి క్యూలో నిలబడి ఉల్లిపాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నా ఈ ప్రభుత్వం స్పందించడం లేదంటే ఇది ఎంత దున్నపోతు-ప్రభుత్వం? అంటూ నిప్పులు చెరిగారు.