Rajyasabha: రెండు వేల రూపాయల నోటు రద్దు ప్రచారంపై కేంద్రం స్పందన

  • రెండు వేల నోటు రద్దుపై ప్రచారం అవాస్తవం 
  • ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
  • కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్

రెండు వేల రూపాయల నోటు రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. రాజ్యసభలో ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో ఇందుకు సంబంధించిన ప్రశ్నను ఎస్పీ సభ్యుడు విశ్వంభర్ ప్రసాద్ నిషద్ అడిగారు.

రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టడంతో దేశంలో నల్లధనం పెరిగిపోయిందని, ఆ నోటు స్థానంలో తిరిగి వెయ్యి రూపాయల నోటును ప్రభుత్వం ప్రవేశపెడుతుందన్న ప్రచారం జరుగుతోందన్న వ్యాఖ్యలకు అనురాగ్ ఠాకూర్ బదులిచ్చారు. ఈ ప్రచారం అవాస్తవమని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. నల్లధనాన్ని నిర్మూలించేందుకు, నకిలీ నోట్లను తొలగించేందుకే గతంలో నోట్ల రద్దు చేశారని అన్నారు.

  • Loading...

More Telugu News