Amma Rajyamlo Kadapa Biddalu: వర్మ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేదన్న సెన్సార్ బోర్డు... విడుదల తేదీ ఎలా ప్రకటిస్తారన్న కోర్టు
- అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రంపై పిటిషన్
- హైకోర్టులో విచారణ
- 12 అభ్యంతరకర దృశ్యాలు తొలగిస్తామన్న వర్మ!
రామ్ గోపాల్ వర్మ చిత్రం అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రంపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వలేదని సెన్సార్ బోర్డు న్యాయస్థానానికి తెలిపింది. దాంతో, సెన్సార్ క్లియరెన్స్ లేని సినిమాకు విడుదల తేదీ ఎలా ప్రకటిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది.
కాగా, ఈ సినిమాలో 12 అభ్యంతరకర దృశ్యాలు తొలగిస్తామని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోర్టుకు తెలిపారు. సన్నివేశాల తొలగింపుపై ఏ నిర్ణయం తీసుకున్నారో ఆధారాలతో సహా రేపటిలోగా తెలియజేయాలని సెన్సార్ బోర్డు, వర్మలను కోర్టు ఆదేశించింది. కాగా, సినిమా రెండు కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని, చంద్రబాబును కించపరిచేలా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు.