onion: దేశవ్యాప్తంగా మరింత పెరిగిన ఉల్లి ధరలు

  • పనాజీలో కిలో ఉల్లి రూ.165
  • కోల్‌కతా, బెంగళూరుల్లో రూ.140
  • దేశంలోని 14 ప్రధాన నగరాల్లో రూ.100 

దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు మరింత పెరిగాయి. కొన్ని రోజులుగా ఉల్లి ధరలు పైపైకి వెళుతుండడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న చర్యలు సరైన ఫలితాలను ఇవ్వట్లేదు. గోవా రాజధాని పనాజీలో కిలో ఉల్లి రూ.165కు చేరింది. కోల్‌కతా, బెంగళూరుల్లో రూ.140, ముంబయి రూ.102, ఢిల్లీలో రూ.96కు చేరింది. ఇక దేశంలోని 14 ప్రధాన నగరాల్లో కిలో ఉల్లి ధర సగటున రూ.100 కంటే అధికంగా ఉంది.
 
మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో ఉల్లి దిగుబడి తగ్గి కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే  కేంద్ర సర్కారు ఉల్లి ఎగుమతులను నిలిపేసింది. అంతేగాక, పెద్ద ఎత్తున ఉల్లిని దిగుమతి చేసుకునే ఏర్పాట్లు చేసింది.

  • Loading...

More Telugu News