rapaka: ఇంగ్లిష్ మీడియంకు మద్దతుగా అసెంబ్లీలో ప్రసంగం.. పవన్ కల్యాణ్ కు షాక్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే రాపాక

  • జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను
  • చంద్రబాబు సర్కారు ఇంగ్లిష్ మీడియం ప్రయత్నాలను మధ్యలో వదిలేసింది 
  • జగన్‌ ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేస్తోంది
  • ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పని సరి చేయడంతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు భాష పరిరక్షణ కోసం ఆయన పోరాటాన్నే ప్రారంభించారు. అయితే, ఆ పార్టీకి చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే  రాపాక వరప్రసాద్.. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ.. జగన్ తీసుకున్న ఇంగ్లిష్ మీడియం నిర్ణయాన్ని స్వాగతించి, పవన్ కు షాక్ ఇచ్చారు.

చంద్రబాబు నాయుడి సర్కారు మధ్యలో వదిలేసిన ఇంగ్లిష్ మీడియం ప్రయత్నాలను జగన్‌ ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేస్తోందని రాపాక అన్నారు. ఈ మంచి నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని, పేద విద్యార్థుల కోసం వైసీపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు.

 ప్రతిపక్ష నేత స్పీకర్‌ను గౌరవించాల్సిన బాధ్యత ఉందని రాపాక హితవు పలికారు. గతంలోనూ వైసీపీ ప్రభుత్వంపై రాపాక ప్రశంసల జల్లు కురిపించారు. రాజోలు నుండి రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించి, ఆ పార్టీలో ఒకే ఒక్క ఎమ్మెల్యేగా నిలిచారు. కొన్ని నెలల క్రితం రాపాక మాట్లాడుతూ.. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే నంబర్ 152గా  నిలుస్తానని, అదే జనసేనలో ఉంటే తన నంబర్ 1గా వుంటుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

  • Loading...

More Telugu News