onion: గతేడాదితో పోలిస్తే కంది పప్పు ధరలు పెరిగాయి: ఏపీ అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని
- తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి సబ్సిడీతో కందిపప్పును అందిస్తున్నాం
- ఏపీలోని రైతు బజార్లలో రూ.25కే ఉల్లిని అందిస్తున్నాం
- కొన్నింటి ధరలు పెరిగాయి
- మరి కొన్నింటి ధరలు తగ్గాయి
ఆంధ్రప్రదేశ్ లో ఉల్లిపాయలతో పాటు కందిపప్పును కూడా సబ్సిడీ ధరలకు అందిస్తున్నామని ఏపీ మంత్రి కొడాలి నాని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు కొడాలి నాని మాట్లాడుతూ సరుకుల ధరలపై వివరణ ఇచ్చారు.
గతేడాదితో పోలిస్తే కంది పప్పు ధరలు పెరిగాయని, తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి సబ్సిడీతో కందిపప్పును అందిస్తున్నామని కొడాలి నాని అన్నారు. ఏపీలోని రైతు బజార్లలో రూ.25కే ఉల్లిని అందిస్తున్నామని వివరణ ఇచ్చారు. కొన్నింటి ధరలు పెరిగాయని, మరి కొన్నింటి ధరలు తగ్గాయని ఆయన తెలిపారు. పెరిగిన ధరలను తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తోందని వివరించారు.