Rahul Gandhi: నేను క్షమాపణలు చెప్పను.. కాసేపట్లో ఓ వీడియోను ట్వీట్ చేస్తాను: రాహుల్ గాంధీ
- ఢిల్లీని అత్యాచారాలకు రాజధానిగా గతంలో మోదీ పేర్కొన్నారు
- ఇందుకు సంబంధించిన క్లిప్ నా ఫోనులో ఉంది
- పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య భారత్ లో ఆందోళనలు
- అందరి దృష్టినీ పక్కదారి పట్టించడానికే బీజేపీ ప్రయత్నిస్తోంది
'రేప్ ఇన్ ఇండియా' అంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని లోక్ సభలో బీజేపీ ఎంపీలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'నేను క్షమాపణలు చెప్పను. ఢిల్లీని అత్యాచారాలకు రాజధానిగా పేర్కొంటూ మోదీ గతంలో వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన క్లిప్ నా ఫోనులో ఉంది. ఈ క్లిప్ ను నేను ట్వీట్ చేస్తాను.. ప్రతి ఒక్కరు చూడొచ్చు. పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య భారత్ లో చెలరేగుతోన్న ఆందోళనల నుంచి అందరి దృష్టిని పక్కదారి పట్టించడానికే బీజేపీ ప్రయత్నిస్తోంది' అని చెప్పారు.