nirbhaya: ఏడేళ్లు పోరాడిన వాళ్లం మరో వారం రోజులు ఎదురుచూడగలం: 'నిర్భయ' తల్లి
- ఈ నెల 18న దోషులపై డెత్ వారెంట్ జారీ అవుతుందని ఆశా దేవి వ్యాఖ్య
- వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని పటియాలా కోర్టులో నిర్భయ తల్లిదండ్రుల పిటిషన్
- ఈ పిటిషన్ పై విచారణ ఈ నెల 18కి వాయిదా
- ఈ నెల 17న సుప్రీంకోర్టులో దోషి అక్షయ్ పిటిషన్ పై విచారణ
నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలుపై జరుగుతోన్న జాప్యంపై ఆమె తల్లి స్పందించారు. 'ఈ కేసులో మేము ఏడేళ్ల పాటు పోరాడిన వాళ్లం మరో వారం రోజుల పాటు ఎదురుచూడగలం. డిసెంబరు 18న దోషులపై డెత్ వారెంట్ జారీ అవుతుంది' అని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో నిర్భయ దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో నిర్భయ తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. అయితే, ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 18కి ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు వాయిదా వేసింది.
నిర్భయ కేసులో దోషి అక్షయ్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం, దానిపై ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతి కోరుతూ నిర్భయ తల్లి పిటిషన్ వేయడంతో.. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ లను ఈ నెల 17న విచారించనున్న విషయం తెలిసిందే. ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలోనే 'నిర్భయ' హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఉరి శిక్ష వెంటనే అమలు చేయాలంటూ వచ్చిన పిటిషన్ పై విచారణను ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.