Pawan Kalyan: రాజు రవితేజ గతంలో ఇటువంటి బాధతోనే పార్టీని వీడి మళ్లీ వచ్చారు: పవన్ కల్యాణ్

  • జనసేనకు రాజీనామా చేసిన రాజు రవితేజ
  • ఆమోదం తెలిపిన పవన్ కల్యాణ్
  • రాజు రవితేజ అభిప్రాయాలను గౌరవిస్తున్నామని వెల్లడి

జనసేన పొలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రాజు రవితేజ గతంలోనూ ఇటువంటి బాధనే వ్యక్తపరుస్తూ పార్టీని వీడి వెళ్లిపోయారని, ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి వచ్చారని  ఓ ప్రకటన విడుదల చేశారు.

రాజు రవితేజ పార్టీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదిస్తున్నామని తెలిపారు. పార్టీ పట్ల ఆయన వ్యక్తం చేసిన ఆవేదన, అభిప్రాయాలను గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి అంతా మంచి జరగాలని ఆ జగన్మాతను కోరుకుంటున్నానని ప్రకటనలో ఆకాంక్షించారు.
 

  • Loading...

More Telugu News