Crime News: భారీగా డ్రగ్స్ స్వాధీనం...తొమ్మిది మంది అరెస్టు

  • 55 కిలోల కొకైన్, 200 కిలోల ఇతర పదార్థాల స్వాధీనం 
  • విలువ రూ.1300 కోట్ల పైమాటే అని అంచనా 
  • పక్కా సమాచారంతో దాడులు

భారీగా మాదకద్రవ్యాలు చిక్కడం దేశరాజధాని ఢిల్లీలో సంచలనమైంది. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పలు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో రూ.1300 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. అధికారులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మహారాష్టల్లో విస్తరించి ఉన్న ఈ డ్రగ్స్ సిండికేట్ కు ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్, నైజీరియా, శ్రీలంక, కొలంబియా, మలేషియాతో సహా పలు దేశాలతో సంబంధాలు ఉన్నాయి.

దీంతో పక్కా సమాచారంతో అన్ని ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం అన్ని ప్రాంతాల నుంచి 55 కిలోల కొకైన్, 200 కిలోల ఇతర మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో 1300 కోట్ల పైమాటే. మన దేశంలో లభించిన మత్తు పదార్థాల విలువే వంద కోట్లు ఉంటుందని అంచనా.

  • Loading...

More Telugu News