ramesh: ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దు ఉత్తర్వులపై స్టే పొడిగింపు
- రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవల కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు
- హైకోర్టును ఆశ్రయించిన రమేశ్
- రమేశ్ జర్మనీ పౌరసత్వం వదులు కున్నారా? లేదా? అని కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవల కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా దీనిపై హైకోర్టు ఇప్పటికే స్టే విధించింది. ఈ కేసులో ఈ రోజు విచారణ జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు మరో ఎనిమిది వారాలు స్టే పొడిగించింది. అలాగే, ఎమ్మెల్యే రమేశ్ జర్మనీ పౌరసత్వం వదులు కున్నారా? లేదా? అన్న విషయాన్ని తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా, ఇటీవల రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేసిన కేంద్ర హోం శాఖ.. ఆయన వాస్తవాలను దాచి పెట్టి మోసపూరిత విధానాల ద్వారా భారత పౌరసత్వం పొందినట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.