YSR Pension: వైఎస్సార్ పెన్షన్ కానుక అమలుపై ప్రభుత్వం మాట తప్పుతోందనాలా? లేక మోసం చేస్తోందనుకోవాలా?: పవన్ కల్యాణ్

  • వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విసుర్లు
  • హామీలపై నిలదీసిన జనసేనాని
  • కొత్త పింఛన్ దారులకు ఒక్క రూపాయి ఇవ్వలేదంటూ విమర్శలు

ఎన్నికల సమయంలో వృద్ధాప్య పింఛన్ రూ.2000 నుంచి రూ.3000కి పెంచుతామని, పింఛన్ అర్హత వయసును 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవడంలేదని జనసేనాని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక పెన్షన్ రూ.3000 చేయలేదని, రూ.250 పెంచి రూ.2250 చేశారని ఆరోపించారు. ప్రభుత్వం మాటతప్పడం వల్ల ఒక్కో పింఛన్ దారుడు రూ.750 నష్టపోతున్నాడని వివరించారు.

అంతేకాకుండా, పెన్షన్ పొందే అర్హత వయసును 65 నుంచి 60 ఏళ్లకి తగ్గిస్తున్నట్టు జీవో ఎంఎస్ నెంబరు 103 ద్వారా చెప్పారని, తద్వారా మరో 10 లక్షల మందికి పెన్షన్ దక్కాలని తెలిపారు. కానీ వాస్తవంలో ఇప్పటివరకు కొత్త పింఛన్ లబ్దిదారులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే, వైఎస్సార్ పెన్షన్ కానుక అమలులో వైసీపీ ప్రభుత్వం అంచెలంచెలుగా మాట తప్పుతోందనాలా? లేక మోసం చేస్తోంది అనుకోవాలా? అంటూ పవన్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News