Kamal Haasan: పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కమలహాసన్ పార్టీ

  • పౌరసత్వ చట్ట సవరణ చేసిన కేంద్రం
  • వ్యతిరేకిస్తున్న ఎంఎన్ఎం
  • సుప్రీంకోర్టులో పిటిషన్

కమలహాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వం చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పౌరసత్వ చట్టంలోని సవరణలు మతపరమైన మైనారిటీలకు మాత్రమే రక్షణ కల్పిస్తున్నాయని, ఈ చట్టం ద్వారా భాషాపరమైన మైనారిటీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ ఎంఎన్ఎం పిటిషన్ దాఖలు చేసింది. ఈ తరహా చట్టం రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించడంలేదని, మతం ఆధారంగా ప్రజలను వర్గీకరించడం సరైన చర్య కాదని ఎంఎన్ఎం తన పిటిషన్ లో పేర్కొంది. పౌరసత్వ చట్టం అమలుయోగ్యం కాదంటూ ఆదేశాలు ఇవ్వాలని ఎంఎన్ఎం తన పిటిషన్ లో సుప్రీంకు విజ్ఞప్తి చేసింది.

  • Loading...

More Telugu News