CCA: ఎవరైనా నిరసన తెలపండి కానీ శాంతియుతంగా ఉండాలి: ఆధ్యాత్మికవేత్త రవిశంకర్
- పౌరసత్వ చట్టంపై తలెత్తిన నిరసనలపై స్పందన
- తమ ఆందోళన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది
- పౌరులెవ్వరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు
జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ స్పందించారు. ఒక భారతీయ పౌరుడిగా ఎవరైనా తమ ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది కానీ, వాటిని శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. పౌరులకు న్యాయం చేసే చట్టపరమైన మార్గాలను మన రాజ్యాంగం ప్రసాదించిందని, పౌరులెవ్వరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరికీ హాని కలగకుండా, ప్రజా ఆస్తులు ధ్వంసం కాకుండా నిరసనలు, ఆందోళనా కార్యక్రమాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు.