Food: మానసిక ఒత్తిడిని చిత్తు చేసే ఆహారం ఇదిగో!

  • ఆస్ట్రేలియా వర్శిటీ అధ్యయనం
  • తీపి, కొవ్వు పదార్థాలతో మానసిక ఒత్తిళ్లు
  • చేపలు, కూరగాయలతో ఒత్తిడి పరార్ అంటున్న పరిశోధకులు

ఆస్ట్రేలియాలోని మకారీ యూనివర్సిటీ పరిశోధకులు మానసిక ఒత్తిడికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తినే ఆహారాన్ని బట్టి మానసిక స్థితిని అంచనా వేయొచ్చని అంటున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్, తీపి పదార్థాలు, కొవ్వు, పాల ఉత్పత్తులు తింటే మానసిక ఒత్తిడి పెరుగుతుందని ఓ అధ్యయనంలో గుర్తించారు. తాజా చేపలు, తక్కువ కొవ్వు ఉన్న మాంసాహారం, పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా ఒత్తిడిని తరిమికొట్టవచ్చని పేర్కొన్నారు.

తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు హ్యాపీ హార్మోన్లు విడుదలై మెదడుపై భారాన్ని తగ్గిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. తక్కువ కొవ్వున్న ఆహారంతో పాటు చెర్రీ ఫ్రూట్స్, క్యాబేజీ, అరటిపండ్లు క్రమం తప్పకుండా తీసుకుంటే మానసిక ఆందోళనలు, ఇతర మానసిక సమస్యలు దూరమవుతాయట. ముఖ్యంగా, మనిషిని ఉల్లాసంగా ఉంచే హ్యాపీ హార్మోన్ కోసం అరటిపండు తింటే సరి అని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.

  • Loading...

More Telugu News