Andhra Pradesh: రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులను ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం
- కాపు ఉద్యమం సమయంలో నమోదైన కేసుల ఎత్తివేత
- భోగాపురం విమానాశ్రయం భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన కేసుల ఎత్తివేత
- రిలయన్స్ ఆస్తుల ధ్వంసం కేసులు కూడా ఎత్తివేత
గతంలో ఉద్యమాల సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి కిశోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2016లో కాపు ఉద్యమం నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తుని, ఇతర చోట్ల నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సందర్భంగా నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తున్నట్టు చెప్పారు. వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత అనంతపురం, గుంటూరు సహా వివిధ ప్రాంతాల్లో రిలయన్స్ ఆస్తుల ధ్వంసం సందర్భంగా నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తున్నట్టు తెలిపారు.